సురక్షితంగా తిరిగొచ్చిన వరంగల్ జిల్లా వాసులు
వరంగల్,(జనంసాక్షి): ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన వరంగల్ జిల్లాకు చెందిన 8 మంది ఏపీ ఎక్స్‌ప్రెస్ ఖాజీపేట చేరుకున్నారు. ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ వీరికి స్వాగతం పలికారు. ఐదు రోజుల పాటు నరకాన్ని అనుభవించామని యాత్రకు వెళ్లొచ్చిన వారు తెలిపారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపామని వెల్లడించారు. యాత్రికులు సురక్షితంగా తిరిగి రావడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.