సృష్టికి మూలం స్త్రీలు – డిప్యూటీ మేయర్

 

 

 

 

 

మహిళ అంతర్జాతీయ దినోత్సవం నిర్వహించిన రెడ్డి శెట్టి శ్రీనివాస్

కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) మార్చ్ 8 :- మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అహర్నిశలు స్త్రీ జాతి ఎదుగుదల కోసం అత్యున్నతమైన ప్రాధాన్యతనిస్తున్న మహిళలకు పెద్దపీట వేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గీతాంజలి స్కూల్ చైర్మన్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్త అన్నారు బుధవారం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మోహన్ రావు కాలనీలోగల గీతాంజలి హై స్కూల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది మహిళలు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సీట్లు పంచి మహిళలందరికీ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ స్త్రీ లేనిదే సృష్టి లేదని అమ్మగా అలుపెరుగని సేవలు అందిస్తూ ఆదరిస్తూ అక్కగా చెల్లిగా ఆలిగా బిడ్డగా ఆత్మీయత అనురాగాలను మానవళికి అందిస్తూ మనుగడ సాగిస్తున్న స్త్రీజాతి ఘన కీర్తి ఎంతో గొప్పదని అన్నారు స్త్రీల గొప్పతనాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మహిళల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడని మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే రాష్ట్రంతో పాటు దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని ఆయన తెలిపారు మహిళలు సమాజానికి స్ఫూర్తి దాతలుగా నిలుస్తున్నారని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ కృష్ణవేణి కరస్పాండెంట్ కృష్ణ రెడ్డి శెట్టి నాగరాణి ఇంద్ర సవిత గౌడ్ గున్న సంధ్య వనిత స్కూల్ విద్యార్థిని విద్యార్థులు మహిళలు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు