సెప్టెంబర్ 4న రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి
తోర్రుర్ 13 ఆగష్టు (జనంసాక్షి) రాష్ట్రవ్యాప్తంగా ఐదున్నర లక్షల మంది హామాలి కార్మికులు పనిచేస్తున్నారని వారి సమస్యలు చర్చించటానికి సెప్టెంబర్ 4న ఖమ్మం పట్టణంలో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామని వాటిని జయప్రదం చేయాలని భారత కార్మిక సంఘాల సమైక్య( ఐ ఎఫ్ టి యు ) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రవిఅన్నారు.నేడు స్థానిక కార్యాలయంలో హామాలి రంగ ముఖ్య కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెక్కలు ముక్కలు చేసుకుని దేశంలో ఎగుమతులు దిగుమతులు చేస్తూ సంపదన పెంచుతున్న హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని అన్నారు. బస్తాలు మోసి మోసి మనుషుల రక్త మాంసాలు కరిగిపోయిన పాలకులకు మనసు రావడం లేదా అని ప్రశ్నించారు.పిఎఫ్,ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని,అన్ని రకాల సంక్షేమ పథకాలకు హమాలీలను అర్హులుగా చూడాలని ఆయన అన్నారు.పెరిగిన నిత్యవసర సరుకులు ధరలు పెట్రోల్ గ్యాస్ ఉత్పత్తుల ధరలు సామాన్యుడిని నడ్డి విరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.అరకొరగా కార్మికులకు రక్షణగా ఉన్న చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దుచేసి కార్పోరేట్ సామ్రాజ్యవాదం అనుకూల లేబర్ కోడ్లను అమలు చేస్తుందని దేశంలో 40 కోట్ల మంది గా ఉన్న సంఘటిత సంఘటిత రంగాల కార్మికులకు తీరా అన్యాయం జరుగుతుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల నుండి 300 మంది ప్రతినిధులు హాజరవుతున్న రాష్ట్ర మహాసభలలో హామాలి రంగం తో పాటు కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు చర్చించనున్నామని సెప్టెంబర్ 4న జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రవి కోరారు. ఐఎఫ్టియు తొర్రూరు ఏరియా కమిటీ కార్యదర్శి కే సంపత్, హామాలీ వర్కర్స్ యూనియన్ నాయకుడు శ్రీరాం పుల్లయ్య,బానోతు బాలు, మల్లేష్,వెంకన్న ఐలయ్య శ్రీహరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అందులో భాగంగా ఆగస్టు 28న జరుగు జిల్లా మహాసభను ఆగస్టు 21న జరుగు ఏరియా మహాసభను జయప్రదం చేయాలని సమావేశంలో తీర్మానించినది.