సెల్‌ఫోన్లు దుకాణంలో రూ.45 వేల విలువగల ఐఫోన్‌ చోరీ

హైదరాబాద్‌: సూటు, బూటు ధరించి సెల్‌ఫోన్ల దుకాణానికి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు రూ.45 వేల విలువగల ఐఫోన్‌ను దొంగిలించారు. ఒకరు ఫోన్‌ కొనుగోలు కోసం వచ్చినట్లు నటిస్తూ సిబ్బందితో చర్చలు జరుపుతుండగా మరో వ్యక్తి షాపు యాజమాని, సిబ్బంది కంటపడకుండా ఫోన్‌ కొట్టేసి దర్జాగా వెళ్లిపోయాడు. ఈ వైనమంతా సీసీ కెమేరా చిత్రించింది. వనస్థలిపురంలోని సంగీత మొబైల్‌ దుకాణంలో జరిగిందీ  సంఘటన. ధనికుల్లా తయారై వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న సంఘటనలు నగరంలో తరచుగా జరుగుతున్నాయి. పైన పేర్కొన్న సంఘటనలో వ్యక్తి ఐఫోన్‌ను కొట్టేసి చొక్కాలో దాచేసినట్లు సీసీ కెమెరా విజువల్స్‌ చూపిస్తున్నాయి. చోరీ విషయమై యజమానులు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.