సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన ఎస్సై రాజ్ కుమార్

 

పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 22
(జనం సాక్షి): మణుగూరు మండలం రామనుజవరం, సాంబాయిగూడెం గ్రామ పంచాయతీ ప్రజలకు ఎస్.ఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో కొంత మంది కేటుగాళ్ళు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలి అనే ఆలోచనతో మత్తు పానీయాలకు చెడు వ్యసనాలకు అలవాటుపడి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాము ఓటిపి చెప్పండని, మీకు ఉచితంగా లక్షల లోను వచ్చిందని చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు అలాంటివారితో తస్మాత్ జాగ్రత్త ఎవరైనా మిమ్ములను అడిగితే మీరు మీ బ్యాంక్ వివరాలు ఆధార్ కార్డు వివరాలు అన్యులకు, అపరిచితులకు చెప్పకండి. సైబర్ నేరాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి.మీకు ఫేక్ ఫొటోస్ పెట్టి ఫేక్ ఫోన్స్ చేసి మాట్లాడుతారు. అలాంటి వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మిమ్ములను ఫోన్ ద్వారా ఎవరైనా ఇలాంటి విషయాలపై ఇబ్బంది పెడితే తక్షణమే పోలీస్ శాఖ వారిని సంప్రదించండి. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది యూత్ పిల్లలు,గ్రామస్తులు పాల్గొన్నారు.