సోదర సోదరీమణుల భావాన్ని బలోపేతం చేసేదే రాఖీ పండుగ.

నెరడిగొండ ఆగస్టు12(జనంసాక్షి):
పవిత్రమైన అక్కచెలెల్ల అనుబంధాన్ని ఆత్మీయత ఐక్యతాన్ని పెంచుతుందని మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్ అన్నారు. శుక్రవారం రోజున రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా జిల్లా సోదర సోదరీమణులకు ప్రజలకు శుభాకాంక్షలు జడ్పీటీసీ అనిల్ జాదవ్ తెలియజేశారు.అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధం ఆప్యాయతకు ప్రతిరూపం రక్షాబంధన్‌ అని ఆయ‌న ​అన్నారు.రాఖీ పౌర్ణ‌మి సంద‌ర్భంగా అనిల్ జాదవ్ ఆయ‌న సోద‌రిమ‌ణులు  రాఖీలు క‌ట్టి మిఠాయిలు తినిపించారు.తొబుట్టువులు మధ్య రాఖీ పండగ‌ జరుపుకోవటం సంతోషంగా ఉందని ఆయన ​అన్నారు.