సోనియాను ఎదిరించే వారెవరూ కాంగ్రెస్‌లో ఉండాల్సిన పనిలేదు
హైదరాబాద్ : రాష్ట్ర విభజనను అడ్డుకుంటే సీమాంధ్ర నేతలు వారి కళ్లల్లో వారే వేలు పెట్టుకున్నట్లేనని మాజీమంత్రి జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటు చేయడమంటే పొట్టి శ్రీరాములు కోరుకున్న ఆంధ్ర రాష్ట్రాన్ని పునరుద్ధరించినట్లేనని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నందుకు సిగ్గుపడుతున్నానన్న ఎమ్మెల్యే జోగి రమేష్‌ను రాజీనామా చేయకుండా ఎవరైనా అడ్డుకున్నారా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. అధినేత్రి సోనియాను ఎదిరించే వారెవరై నా కాంగ్రెస్‌లో ఉండాల్సిన అవసరం లేదని అన్నారు.