సోషల్ మీడియా పై అవగాహన కల్పించిన మందమర్రి సి.ఐ.
రామకృష్ణాపూర్ , (జనంసాక్షి) : పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గురుకుల బాలికల పాఠశాలలో మందమర్రి సిఐ మహేందర్ రెడ్డి సోషల్ మీడియాపై విద్యార్థులకు గురువారం అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు పిల్లలు స్మార్ట్ మొబైల్ వాడకూడదని తెలిపారు. చిన్న ఫోన్లు వాడాలని సూచించారు. సోషల్ మీడియాలో అకౌంట్ కలిగి ఉండరాదని తెలిపారు. ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సప్ లలో ఫోటోలు డి.పి.లుగా పెట్టరాదని పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్ అవాయిడ్ చేసినప్పుడు ఎలాంటి క్రైమ్స్ కావని పేర్కొన్నారు.
ఈ మధ్యకాలంలో చాలా లింక్స్ వస్తున్నాయని ప్లీజ్ అప్డేట్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్ అని ఫేక్ లింక్స్ వచ్చినప్పుడు వాటిని క్లిక్ చేసినట్లయితే మనకు సంబంధించిన డేటా మొత్తం సైబర్ నేరగానికి వెళ్తుందని తెలిపారు. అలాంటి లింక్స్ ను ఓపెన్ చేయకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్.ఐ. బి అశోక్, గురుకుల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.