సౌర విద్యుత్‌పై మంత్రివర్గ ఉపసంఘం భేటీ
హైదరాబాద్. సౌరవిద్యుత్ కొనుగోలు, బిడ్‌లు ఖరారు సంబంధించి ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ఇవాళ భేటీ అయింది. లేక్‌వ్యూ అతిథి గృహంలో సమావేశమైన మంత్రి వర్గ ఉపసంఘం సభ్యులు మంత్రులు ఆనం నారాయణరెడ్డి, కన్నా లక్ష్మి నారాయణ , సుదర్శన్‌రెడ్డి,బొత్స సత్య నారాయణ, గీతారెడ్డి, రఘువీరారెడ్డి సమావేశమయ్యారు.సౌర విద్యుత్ కొనుగోలు , ధర, బిడ్ల ఖరారు అంశాలపై చర్చిస్తున్నారు.