స్టార్ రేటెడ్ లో నెంబర్ వన్ ఆర్కే. వన్. ఏ.

 

ప్రధమ బహుమతి పొందిన మందమర్రి ఏరియా గని

రామకృష్ణాపూర్ , (జనంసాక్షి): మినిస్ట్రీ ఆఫ్ కోల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన స్టార్ రేటెడ్ లెవెల్ బొగ్గు గనుల్లో మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ లోని ఆర్కే. వన్. ఏ. గణికి ప్రథమ స్థానం వచ్చినట్లు గని మేనేజర్ ఎం. శ్రీధర్ రావు శనివారం తెలిపారు. గాని పై ఈపాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులకు, యూనియన్ నాయకులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. రక్షణ తో కూడిన ఉత్పత్రియే లక్ష్యంగా పనులు నిర్వహిస్తున్నామని, ప్రథమంగా నిలవడం గర్వకారణంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గని రక్షణ అధికారి జయంత్ కుమార్, వెంటిలేషన్ అధికారి వెంకటేష్, గని ఫిట్ ఇంజనీర్ సతీష్, అండర్ మేనేజర్ దిలీప్, టి బి జి కే ఎస్ ఫిట్ సెక్రటరీ బండారి బిక్షపతి, ఏ ఐ టి యు సి ఫిట్ సెక్రెటరీ సురమళ్ళ వినయ్ కుమార్, గని సీనియర్ పర్సనల్ ఆఫీసర్ కార్తీక్, ఇతర నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం రక్షణ ప్రతిజ్ఞతో కార్యక్రమాన్ని ముగించారు.