
కొండపాక(జనం సాక్షి)జులై30: కొండపాక మండలలో మర్పడగ గ్రామానికి చెందిన వల్లంగల్ల నగేష్ కు స్ఫూర్తి శిఖర జాతీయ విశిష్ట సేవ పునస్కారానికి ఎన్నికయ్యాడు. గతంలో చేసిన సామాజిక సేవలను గుర్తించి స్ఫూర్తి శిఖర జాతీయ విశిష్ట సేవ పునస్కారం 2022 కోసం ఎంపిక చేయడమైనది. ఈ పునస్కారాన్ని పుడమి సాహితి వేదిక 75వ స్వతంత్ర అమృత మహోత్సవ సందర్భంగా ఆగస్టు 13, 2022 శనివారం రోజున హైదరాబాదు రవీంద్ర భారతి నందు జరిగే పునస్కార ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధుల చేతుల మీదుగా ప్రధానం చేయబడుననీ పుడమి సాహితీ వేదిక తెలంగాణ జాతీయ అధ్యక్షులు డాక్టర్ చిలుముల బాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పునస్కారం వచ్చినందుకు గాను మరింతగా బాధ్యత పెరిగిందని అలాగే సేవలను అందిస్తానని తెలిపాడు.