స్వచ్చత కోసం కళా ప్రదర్శనలు

జయశంకర్‌ భూపాలపల్లి,నవంబర్‌17(జ‌నంసాక్షి): జిల్లాలోని ప్రతి ఒక్కరికీ మరుగుదొడ్ల ప్రాముఖ్యత తెలిసేలా సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వాలని కలెక్టర ఆకునూరి మురళి కళాకారులకు సూచించారు. ఈ నిర్ణయంతో కళాకారులకు ఉపాధి దక్కడంతో పాటు పథకం కూడా విస్తృత ప్రచారం పొందగలదు. ఎక్కడా లేని విధంగా ఈ జిల్లాలో ప్రచారంతో ప్రజల్లో చైతన్యం తేవాలని నిర్నయించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కళాకారులు ధూమ్‌ ధామ్‌ నిర్వహించినట్లుగానే మరుగుదొడ్లపై అవగాహన చేపడతారు. ఇలా చేయడం వల్ల్‌ ప్రజల్లో చైతన్యంతో పాటు, ఆలోచన వస్తుందని భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 20కళా బృందాల ద్వారా ప్రదర్శన నిర్వహిస్తామని, అందుకు ఈ నెల 25,26 తేదీల్లో తాడ్వాయిలో రచయితలతో వర్క్‌షాప్‌ నిర్వహిస్తామని తెలిపారు. బహిరంగ మల విసర్జన వల్ల కలిగే అ నర్థాలు, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ఆసక్తి ఉన్న రచయితలు పాటలు, నాటకాలు రాసి జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో ఈ నె ల 22వ తేదీలోగా అందజేయాలన్నారు. అత్యుత్తమ రచనకు నగదు బహుమతి అందిస్తామని కలెక్టర్‌ తెలిపారు. ఈ మేరకు మరుగుదొడ్ల నిర్మాణం, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతపై జిల్లా గ్రావిూణభివృద్ధి శాఖ సమాచారశాఖ ఆధ్వర్యంలో కళాకారులకు ఒక్క రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ కళాకారులనుద్దేశించి మాట్లాడారు. జయశంకర్‌ జిల్లా కళాకారులు తెలంగాణ ఉద్యమ సమయంలో చూపించిన పోరాట పటిమను స్వచ్ఛ జిల్లాగా మార్చటంలో కూడా చూపించి, జిల్లాలోని ప్రతి ఒక్క ఇంటిలో మరుగుదొడ్డి నిర్మంచుకునేలా చైతన్యపరచాలన్నారు. ఇలాచేస్తే ఇతర జిల్లాలకు కూడా ఇక్కడికళాకారులు ఆదర్శం కానున్నారు.