స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల

సందర్భంగా వ్యాస రచన పోటీలు
* స్పోకెన్ ఇంగ్లీష్ టైనర్,సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హమీద్ షేక్
మిర్యాలగూడ. జనం సాక్షి
స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల (75వ స్వాతంత్య్ర దినోత్సవం) సందర్భంగా వ్యాస రచన పోటీలు నిర్వహించనున్నట్టు స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్, సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హమీద్ షేక్ పేర్కొన్నారు. 6 నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని ప్రకటించారు. “భారత స్వాతంత్ర్య సముపార్జన సాధనలో మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు పాత్ర – 75 ఏండ్లలో భారత్ సాధించిన అభివృద్ధి” ( ద రోల్ ఆఫ్ మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు ఇన్ అటెయినింగ్ ఫ్రీడమ్ ఫర్ ఇండియా…అచీవ్మెంట్ అటైన్డ్ బై ఇండియా డ్యూరింగ్ 75 ఇయర్స్) ” అంశంపై ఆరు ఏ-4 సైజ్ పేపర్ లకు మించకుండా ఇంటి వద్ద నుంచి లేదా ఉపాధ్యాయుల సమక్షంలో మంచి వ్యాసం రాసి తమకు పంపాలని కోరారు. ఉత్తమ వ్యాసాలను ఎంపిక చేసి బహుమతులు అందజేయనున్నట్టు తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని పాఠశాలల్లో చదువుతున్న తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం విద్యార్తినీవిద్యార్థులు ఈ పోటీలో పాల్గొనాలని కోరారు. వ్యాసాలు రాసిన అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్/ సంబంధిత తరగతి ఉపాధ్యాయుడు/ తల్లిదండ్రులచే ధ్రువీకరణ చేయించుకున్న వ్యాసాలను న్యూ మున్సిపల్ కాంప్లెక్స్ లోని సనా మొబైల్స్, షాపు నెంబర్.52 లో నేరుగా ఆగస్టు 13వ తేదీ సాయంత్రం 8 గంటల లోపు అందజేయాలని కోరారు. వ్యాసం రాసిన పేపర్ పై భాగంపై పేరు, తండ్రి పేరు, తరగతి, ఫోన్ నెంబర్, స్కూల్ పేరు, పాఠశాల నెంబర్ కచ్చితంగా రాయాలని కోరారు. ఉత్తమ వ్యాసాలు అందించిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేయనున్నట్టు హమీద్ షేక్ పేర్కొన్నారు.