స్వతంత్ర వజ్రోత్సవాల్లో భారత కీర్తిని దశదిశలా చాటుదాం.
నెరడిగొండఆగస్టు8(జనంసాక్షి):
75వ భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పండుగ వాతావరణంల మండలంలో ఘనంగా నిర్వహించాలని మండల స్థాయి అధికారులు ఎంపీడీఓ అబ్దుల్ సమద్, తహశీల్దార్ పవన్ చంద్ర,ఎంపీఓ శోభన,ఎపిఓ వసంత్ రావు లుఅన్నారు.సోమవారం రోజున మండల కార్యాలయ సమావేశ మందిరంలో భారత స్వతంత్ర వజ్రోత్సవంలో నేపథ్యంలో ఈనెల 8 నుంచి 22 వరకు నిర్వహించవలసిన కార్యక్రమాల ఏర్పాట్లపై మండల సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వజ్రోత్సవ వేడుకలను పగడ్బందీగా చేపట్టి విజయవంతం చేయాలని అన్నారు.భారత దేశానికి స్వతంత్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈనెల 8 నుంచి 22 వరకు వజ్రోత్సాహ వేడుకల షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని అన్నారు.నిర్వహించే కార్యక్రమానికి అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.