*స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా దళితులపై దాడులు జరగడం అప్రజాస్వామీకంఎపూరి రాజు*

కోదాడ, ఆగస్టు,23(జనంసాక్షి)
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా ప్రభుత్వాలు ఒకపక్క సంబరాలు జరుపుకుంటుంటే మరోపక్క దేశంలో దళితులపై అడుగడుగునా వివక్ష చూపుతూ దాడులు జరగడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమైనని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ కోదాడ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఏపూరి రాజు మాదిగ అన్నారు. రాజస్థాన్ లోని సూరానా గ్రామంలో దళిత విద్యార్థి కుండలో మంచినీళ్లు తాగాడనే నేపంతో అగ్రవర్ణాలకు చెందిన స్కూల్ టీచర్ చేసిన దాడిలో దారుణ హత్యకు గురైన మూడవ తరగతి దళిత విద్యార్థి ఇంద్ర కుమార్ మెగ్వాల్ హత్యను నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం కోదాడ పట్టణంలో పాఠశాలలను బంద్ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా దళితులపై నేటికీ అడుగడుగునా కుల వివక్ష చూపుతూ మంచినీళ్లు కూడా తాగే స్వేచ్ఛ లేని స్వాతంత్రం వచ్చి దళితులకు ఏం ఉపయోగం అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న అగ్రవర్ణ పాలకులు దళితుల కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రూపొందించిన ప్రత్యేక చట్టాలను పక్షపాతంతో అమలు చేయకపోవడంతోనే దళితులపై నేటికీ ఇటువంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని  లేని  పక్షంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాలను హెచ్చరించారు. దళిత విద్యార్థికి సంఘీభావంగా స్వచ్ఛందంగా బందు పాటించిన పాఠశాల, కళాశాల విద్యార్థులకు, యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి నియోజకవర్గ నాయకులు కొండపల్లి ఆంజనేయులు మాదిగ, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నియోజవర్గ అధ్యక్షులు షేక్ బాజాన్, ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు కుడుముల శ్రీను, రేవంతన్న సైన్యం నియోజకవర్గ నాయకులు జలంధర్ భగత్, ఎం ఎస్ పి పట్టణ మైనార్టీ నాయకులు షేక్ మౌలానా, ఎమ్మెస్ ఎఫ్ నియోజకవర్గ ఇంచార్జ్ కుక్కల కృష్ణ ,సోమపంగు సురేష్, ఏపూరి సత్యరాజు, షేక్ రఫీ, ఏపూరి క్రాంతి, సూరేపల్లి తిమోతి, జయంతు ఎలమంచి, వంగూరి జగదీష్ ,వంగూరి అఖిల్ తదితరులు పాల్గొన్నారు