స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అలరించిన అలంకృత శకటాలు

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 13 అలంకృత శకటాలు తమ తమ శాఖల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలను కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించాయి. ఉత్తమ శకటాల ఎంపికకై సీనియర్ జర్నలిస్ట్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, మునిసిపల్ శాఖ విశ్రాంత డి ఈ జెట్టి రామకృష్ణ మోహన్ రావు, ఆంధ్రా లయోలా కళాశాల అధ్యాపకులు డాక్టర్ మొవ్వా శ్రీనివాసరెడ్డి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.ఇక ‘పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షణ (సర్కారు బడుల్లో గ్లోబల్ చదువులు), వైద్య ఆరోగ్య శాఖ, గ్రామ వార్డు సచివాలయాల శాఖ (సేవా వారధులు – గ్రామ వాలంటీర్లు) శకటాలు వరుసగా ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు లభించాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులను అభినందిస్తూ అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.డీజీపీ కె.రాజేంద్రనాధ్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాతా ల తో పాటు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో అడిషనల్ డైరెక్టర్ శ్రీమతి ఎల్ స్వర్ణలత, జాయింట్ డైరెక్టర్ లు పోతుల కిరణ్ కుమార్, శ్రీమతి టి కస్తూరిబాయ్ వారి సిబ్బంది పర్యవేక్షించారు.ఈ వేడుకల అనంతరం శకటాలు నగర పుర వీధుల్లో సంచరించి నగర వాసులను అలరింపచేశాయి.

తాజావార్తలు