స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు
రామకృష్ణాపూర్ , (జనంసాక్షి) : భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినఅయిన సందర్భంగా “స్వతంత్ర భారత వజ్రోత్సవ” కార్యక్రమంలో భాగంగా పురపాలక శాఖసంచాలకుల ఆదేశాలు మేరకు స్థానిక విజయగణపతి ఆలయం లో క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మహిళలకు దేశ భక్తి, జాతీయ స్పూర్తి చాటేలా ముగ్గుల పోటీలు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమములో మహిళలు పాల్గొని దేశ భక్తి ని, జాతీయ స్పూర్తి ని చాటేల ముగ్గులు వేశారు. ముగ్గుల పోటీలలో మంచి ప్రదర్శన కనబర్చిన మహిళలకు బహుమతులు అందజేశారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకట్ నారాయణ చేతులమీదుగా మొదటి బహుమతి జె. రితిక, రెండవ బహుమతి స్వర్ణలత, మూడవ బహుమతి కుమారి కె. అంజలిలకు అందజేశారు. ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకట్ నారాయణ, కో ఆప్షన్ సభ్యులు ఎండి యాకుబ్ అలీలుమాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్ర పిలుపుమేరకు వజ్రోత్సవాలునిర్వహించుకుంటున్నామని, అందులో భాగంగా క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని అన్నారు. మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని జాతీయ సమైక్యతను వారు వేసిన ముగ్గుల రూపంలో ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పనాస రాజు, రామిడి ఉమాదేవి, పార్వతి విజయ కొ – ఆప్షన్ సభ్యులు రజియా, మేనేజర్ నాగరాజు, పి. కృష్ణ ప్రసాద్, రెవెన్యూ అధికారి, ఇ. వసంత్, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్, ఏ. శ్రీధర్, టి.ఎం.సి, ఆర్.పి.లు, పట్టణ ప్రజలు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.