హమాలి కార్మికులకు సంక్షేమ చట్టం చట్టబద్ధహక్కులు అమలుకై ఉద్యమించాలి

* ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు సీతారామయ్య

టేకులపల్లి, మార్చి 18( జనం సాక్షి ): హమాలీ కార్మికులకు సంక్షేమ చట్టం, చట్టబద్ధహక్కులు అమలు కోసం ఉద్యమించాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె సీతారామయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది నిరుద్యోగులు హమాలీ రంగంలో పనిచేస్తున్నారని చదువుకున్న వారికి ఉద్యోగం రాక,ఉపాధి లేక రెక్కల కష్టాన్ని నమ్ముకుని ఒళ్లుగుళ్ళ చేసుకొని పనిచేస్తున్న హమాలీ కార్మికులకు కనీస వేతనాల చట్టం,చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని,చట్టబద్ధహక్కులు కల్పించాలని, నష్టపరిహారం చెల్లించాలని, 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్స్ సౌకర్యం కల్పించాలని,డబల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏప్రిల్ 2,3 తేదీలలో కొత్తగూడెంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర 2వ మహాసభలు కొత్తగూడెంలో నిర్వహిస్తున్నారు.ఈ సభలో ప్రచారంలో భాగంగా టేకులపల్లిలో మంచ అధ్యక్షతన హమాలి కార్మికుల సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రభుత్వరంగ పరిశ్రమలను అమ్ముకొని ప్రజాద్రోహానికి,కార్మిక చట్టాలు రద్దుచేసి కార్మిక విద్రోహనికి పాల్పడుతున్న మోడి ప్రభుత్వం యువకుల ఉద్యోగ,ఉపాధిని దెబ్బతీస్తున్నార ని విమర్శించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై మహాసభలో సమగ్రంగా చర్చించబడుతుందని ఏప్రిల్ 2న కార్మిక ప్రదర్శన, బహిరంగ సభలు ఉంటాయని ఈ కార్యక్రమాలలో కార్మిక సోదరులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో తెలంగాణ హామాలి అండ్ మిల్ వర్కర్స్ యూనియన్(IFTU) జిల్లా నాయకులు మంచా,ఉప మేస్త్రి నాగేశ�