హరితహారంలో గిరిజనులు భాగస్వాముల కావాలి
ప్రజలంతా పాల్గొంటేనే విజయవంతం: చందూలాల్
వరంగల్,జూలై9(జనం సాక్షి): హరితహారం కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గిరజిన సంక్షేమశాఖ మంత్రి చందూలాల్ పిలపునిచ్చారు. గిరిజనులు ముఖ్యంగా అడవుల సంరక్షణ, అడవుల పెంపకంలో పాలుపంచుకోవాలన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో హరిత రక్షణ కమిటీలను వినియోగించుకోవాలన్నారు. హరితహారం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యార్థులతో పాటు అన్ని వర్గాలనూ భాగస్వామ్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలను నాటించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో అడవుల విస్తీర్ణానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించినట్లు గుర్తుచేశారు.విద్యార్థులతో మొక్కలను నాటించే విధానంపై అవగాహన, సంరక్షణ బాధ్యతలను చేపట్టడానికి అధికారులకు, గ్రామస్థాయి సిబ్బందికి అప్పగించాలన్నారు. ప్రజా ప్రయోజన కార్యక్రమం అయినందున గ్రామస్థాయిలో సర్పంచులు బాధ్యత వహించి ప్రజల భాగస్వామ్యంతో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటించాలని సూచించారు. మొక్కలు నాటేందుకు ముందుగానే గుంతలను తవ్వి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమం భవిష్యత్
తరాలకు ఆధారంగా నిలువనుందని అన్నారు. ఇంటికో మొక్కతో పాటు గ్రామంలో మూకుమ్మడిగా మొక్కలు నాటడం ద్వారానే భవిష్యత్ వాతావరణం కలుషితం కాకుండా ఉంటుందన్నారు. దీనిని ప్రజలు తమదగి భావించి బాధ్యతగా చేపట్టాలన్నారు.
——————-