హరితహారంలో మొక్కలు నాటండి

జనగామ,జూన్‌29(జనం సాక్షి ): తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పర్యావరణ పరిరక్షణ కోసం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి సంవత్సరం దిగ్విజయంగా మొక్కలు నాటిస్తున్నారని ఎమ్మెల్సీ బి. వెంకటేశ్వర్లు చెప్పారు. రాష్ట్రంలో 230 కోట్లు మొక్కలను నాటడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అడువుల నరికే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్యేయమని అన్నారు. హరితతెలంగాణ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ విశేష కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం పథకంలో భాగంగా మొక్కలు నాటాలన్నారు. పర్యావరణ పరిరక్షణెళి ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. చెట్లను నరకటం వలన మానవుని మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పారు. మూడో విడత హరితహారంలో కూడా గ్రామాల్లోఅత్యధిక మొక్కలు నాటుతున్నారని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటటంతోపాటు వాటిని సంరక్షించాల్సిన భాద్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ప్రతిఒక్కరూ సామాజిక భాద్యతగా హరితవిప్లవం చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రతిఇంట్లో రెండు మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజారంజక పాలనను కొనసాగిస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూలతోపాటు అమలు చేస్తున్నారని కొనియాడారు.