హర్ ఘర్ తిరంగా ర్యాలీ.

ఫోటో రైటప్: ర్యాలీ నిర్వహిస్తున్న తపాల ఉద్యోగులు.
బెల్లంపల్లి, ఆగస్టు11, (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలో గురువారం తపాల ఉద్యోగులు సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ శ్రీరామారావు ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీ చేపట్టి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు, ఆర్డీవో శ్యామదేవికి జాతీయ జెండాను బహుకరించారు. ఈసందర్భంగా డివిజనల్ ఇన్స్పెక్టర్ శ్రీరామారావు మాట్లాడుతూ మన దేశం స్వాతంత్ర్యం పొంది 75 వసంతాలు పూర్తి చేసుకొని వజ్రోత్సవాలు నిర్వహించుకుంటున్న నేపథ్యంలో అందరిలో జాతీయ సమైఖ్యత పెంపొందించేలా ఇట్టి కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో తపాల ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.