హస్తినలో తెలంగాణ వేడి
న్యూఢిల్లీ: హస్తినలో తెలంగాణ వేడి రాజుకుంది. తెలంగాణపై ఢిల్లీ పెద్దలు ఏం తీర్పు చెబుతారో అని తెలంగాణవాదుల్లో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సీమాంధ్ర పార్టీలు ఏం చెప్పాలో తెలియక సతమతమవుతున్నాయి. తెలంగాణపై అఖిలపక్షం 28న నిర్వహిస్తుండటంతో ఢిల్లీకి రాష్ట్ర నేతలు చేరుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మందా జగన్నాథం, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, రాజయ్య, వివేక్ హస్తిన చేరుకున్నారు. మధ్యాహ్నం కేసీఆర్, నాయిని నర్సింహారెడ్డి, కోదండరాం ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున మల్లు రవి, చెంగల్రాయుడు, కేఆర్ సురేష్‌రెడ్డిలు హస్తినకు పయనమయ్యారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీకి చేరుకోనున్నారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీ మాత్రం తమ పార్టీ ప్రతినిధులను ప్రకటించలేదు, ఆ రెండు పార్టీలు తీవ్ర సమాలోచనలు జరువుతున్నట్లు సమాచారం.