హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌పై నిషేధం ఎత్తివేత

న్యూఢిల్లీ,జనవరి24(జ‌నంసాక్షి): టీమిండియా ఆటగాళ్లు హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌పై సుప్రీంకోర్టు నియమిత పాలక మండలి (సీవోఏ) సస్పెన్షన్‌ ఎత్తివేసింది. టీవీ టాక్‌ షో ‘కాఫీ విత్‌ కరణ్‌’లో పాల్గొన్న ఈ ఇద్దరు ఆటగాళ్లు మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. దేశవ్యాప్తంగా వీరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రాహుల్‌, పాండ్యా వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన సీవోఏ ఇద్దరిపైనా నిషేధం విధించింది. ఆసీస్‌ పర్యటనలో ఉన్న వీరిద్దరినీ బీసీసీఐ అర్ధంతరంగా వెనక్కి పిలిపించింది. ఆస్టేల్రియాయాతో జరిగే వన్డే సిరీస్‌లో చోటు కోల్పోయిన ఈ ఇద్దరినీ న్యూజిలాండ్‌ పర్యటనకు కూడా ఎంపిక చేయలేదు. పాండ్యా, రాహుల్‌పై నిషేధం ఎత్తివేయాలంటూ బీసీసీఐ సహా, పలువురు మాజీ క్రికెటర్లు కూడా సీవోఏను కోరారు. కాగా, తాజాగా వీరిద్దరిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసినట్టు బీసీసీఐ తెలిపింది.

షవిూకి భోగ్లే ప్రశంసలు

భారత జట్టు పేసర్‌ మహ్మద్‌ షవిూపై క్రికెట్‌ కామెంటేటర్‌ హర్షా భోగ్లే ప్రశంసలు కురిపించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో షవిూ కీలక పాత్ర పోషించి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. భోగ్లే మాట్లాడుతూ.. భారత జట్టులోని అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో షవిూ ఒకడని ప్రశంసించాడు. ఈ మ్యాచ్‌లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు అందుకున్న షవిూ ప్రపంచకప్‌లో తన చోటును ఖరారు చేసుకున్నాడని పేర్కొన్నాడు. షవిూ ఫామ్‌లోకి రావడం శుభపరిణామమని, ఇంగ్లండ్‌ వెళ్లే భారత జట్టులో షవిూకి చోటు పక్కా అని అభిప్రాయపడ్డాడు.