హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శిగా పట్లోళ్ల నర్సింలు.

తాండూరు. ఆగస్టు 14(జనంసాక్షి)హిందూ ఉత్సవ కేంద్ర సమితి ప్రధాన కార్యదర్శిగా పట్లొళ్ల నరసింములు ను నియమిస్తూ ఎన్నికల అధికారి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రవి కుమార్ వెల్లడించారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆదివారం హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉత్సవ సమితి సభ్యుల సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా నే హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శిగా పట్లొళ్ల నర్సింలు, అధ్యక్షురాలుగా మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ , గౌరవ అధ్యక్షులు రాజు గౌడ్, కోశాధికారిగా పూజారి పాండు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బోయరాజులను ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి ఎన్నికల అధికారిగా మాజీ కౌన్సిలర్ రవికుమార్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యధిక వార్డుల నుండి మెజార్టీ సభ్యులు పట్లొళ్ల నర్సింలును హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పట్లోళ్ల నర్సింలు పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పట్లొళ్ల నర్సింహులు ను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రాము, వెంకన్న గౌడ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.