*హోరెత్తిన నిరసనలు పాల ఉత్పత్తులపై జిఎస్టీ విదింంపు కు నిరసనగా తెరాస ఆందోళన
నిర్మల్ బ్యూరో, జూలై 21: జనంసాక్షి,,, పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధింపుకు వ్యతిరేఖంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపుతో టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. పాలు, పాల అనుబంధ ఉత్పత్తులపై కేంద్రం ఇటీవల ప్రకటించిన జీఎస్టీ పన్నుకు వ్యతిరేకంగా నేతలు తమ నిరసనను వ్యక్తం చేశారు. నిర్మల్ పట్టణంతో పాటు అన్ని మండలాల్లో ఖాళీ పాల క్యాన్లను పట్టుకుని నిరసన చేపట్టారు. జీఎస్టీకి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. సాలు మోదీ… సంపకు మోదీ, పాల ఉత్పత్తులపై జీఎస్టీని వెంటనే రద్దు చేయాలి అనే ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ జీఎస్టీని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిదులు మాట్లాడుతూ… బీజేపీ హయంలో మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిత్యవసరాలపై జీఎస్టీ విధించి సామాన్యులపై పెను భారం మోపుతుందన్నారు. పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కేంద్రం జీఎస్టీ ఉపసంహరించే వరకు ప్రజల పక్షనా టీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.ఈకార్యక్రమంలో తెరాస నాయకులు ఎడిపెల్లి నరేందర్,మేధారపు ప్రదీప్,నేరేళ్ల వేణు,తదితరులు పాల్గొన్నారు