హ్యూమన్ రైట్స్ స్టేట్ ఆక్టివ్ మెంబర్ గా సాగంటి మంజుల నియామకం.
హన్మకొండ బ్యూరో చీఫ్ 22 సెప్టెంబర్ జనంసాక్షి
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అఫ్ ఇండియా ఉమెన్స్ ప్రొటెక్షన్ విభాగం లో తెలంగాణ స్టేట్ ఆక్టివ్ మెంబర్ గా హన్మకొండ జిల్లా గోపాలపురం ప్రాంతానికి చెందిన సాగంటి మంజుల నియమితులైనట్టు కౌన్సిల్ జాతీయ చైర్మన్ షేక్ హాజీ షేర్ ఖాన్ ఉత్తర్వులు జారీ చేశారు.. ప్రస్తుతం మంజుల లెక్చరర్, రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తూ, నేను సైతం ఫౌండేషన్ లో కన్వీనర్ గా సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.. ఈ సందర్బంగా మంజుల మాట్లాడుతూ ఉమెన్స్ ప్రొటెక్షన్ స్టేట్ ఆక్టివ్ మెంబర్ గా తన బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తానని మహిళల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని. తనని నియమించిన కౌన్సిల్ చైర్మన్,మెంబర్స్ కీ కృతజ్ఞతలు తెలిపారు…