హౖదరాబాద్ చేరుకున్న శరద్ పవార్
హైదరాబాద్, జనంసాక్షి: కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శరద్ పవార్ శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. జొన్నగింజల పరిశోధనాలయంలో జరగనున్న ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అదేవిధంగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్‌లో ఆదివారం జరిగే కార్యక్రమాలకు శరద్ పవార్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఎన్జీ రంగా శాప్త్రవేత్తలతో వ్యవసాయ పరిశోధనలపై పవార్ చర్చించనున్నారు.