ట్రాక్టర్ బోల్తా: 10 మందికి గాయాలు

విజయనగరం: ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో 10 మంది వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులందరూ సంకుపాలెం గ్రామానికి చెందినవారు. ఈ ప్రమాదం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గచ్చలవలసలో చోటుచేసుకుంది. వీరంతా దైవదర్శనం కోసం సింహాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.