11 మంది మంత్రులున్నా రైతులకు న్యాయం చేయలేదు : నామా
ఢిల్లీ : నీలం తుపాను వల్ల నష్టపోయిన రైతులను అదుకోవటంలో కేంద్రం విఫలమైందని ఎంపీ నామా పేర్కోన్నారు. రాష్ట్రం నుంచి 11 మంది కేంద్రమంత్రులు ఉన్నా రైతులకు న్యాయం చేయలేకపోయారని అయన విమర్శించారు. పార్లమెంటు వద్ద తెదేపా అందోళన నేపద్యంలో ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ తెదేపా ఎంపీలు ధర్నా చేస్తుంటే మంత్రులు నవ్వుతూ వెళ్లడం రైతులను హేళన చేయడమేనని మండిపడ్డారు. చిన్న వ్యాపారాల పోట్టకోటేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం ద్వారాలు తెరిచిందని అయన ఎద్దేవా చేశారు. రైతులకు ఎలా మేలు జరుగుతుందో పార్లమెంటు సాక్షిగా కేంద్రం చెప్పాలని అయన డిమాండ్ చేశారు.