137 సంఘాలతో నేడు భేటీ కానున్న టీజేఏసీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): సకల జనుల సమ్మె కాలంలో కేంద్ర ప్రభుత్వాలను గడగడలాడించిన 137 సంఘాలు ఈ రోజు మరోసారి సమావేశం కానున్నారు. కేంద్రం తెలంగాణను ప్రకటించిన సందర్భంలో జరుగుతున్న ఈ భేటీకి విశేష ప్రాధాన్యత  ఏర్పతున్నది. టీఎన్టీవో భవన్‌ టీజేఏసీ చైర్మన్‌ ప్రొ.కోదండరాం సారధ్యంలో ఈ సమావేశం జరుగనున్నది. సకల జనుల సమ్మెతో భారత ఉద్యమాల చరిత్రలో ఒక అపూర్వఘట్టాన్ని ఆవిష్కరించిన సింగరేణి జేఏసీ, ఆర్టీసీ జేఏసీ, పబ్లిక్‌సెక్టార్‌ జేఏసీలు మరోసారి ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. సీమాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యలో జరుగుతున్న కృత్రిమ ఉద్యమాలను తిప్పిన ఈ సారి ఉద్యమరచన చేయనున్నారు. అప్రమత్తంగా లేకపోవడం వల్లనే డిసెంబర్‌ 9, 2009 ప్రకటనను కాపాడుకోలేకపోయామని తెలంగాణ జేఏసీలన్నీ భావిస్తున్నాయి. కేంద్రం విభజన ప్రక్రియ ప్రారంభమైందని సుస్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో  తెలంగాణను కాపాడుకునేందుకు శాంతియుతంగా, ప్రజాస్వామ్యపద్దతిలో ఉద్యమమాలను నిర్మించాలని జేఏసీలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా హైదరాబాద్‌లో నిర్వహించనున్న భారీ శాంతిర్యాలీకి తేదీని ఖరారు చేయనున్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ సారథ్యంలో జరుగుతున్న సద్భావన శాంతి ర్యాలీలకు సానుకూల స్పందన వస్తున్న నేపథ్యంలో ఈ ఉద్యమాల ద్వారా సీమాంధ్ర ప్రజలకు శాంతి సందేశం పంపించేందుకు, విభజనకు సహకరించాలని వినతితో ప్రత్యేక ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు ఈ సమావేశం జరుపుతున్నారు.