15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపుతో గిరిజనులు ఆనందం.

జనంసాక్షి న్యూస్
ఆదివాసీ మహిళ అద్భుతం సృష్టించి భారతదేశ15వ రాష్ట్రపతిగా ఎన్నికయిన సందర్భంగా శుక్రవారం నాడు మండల కేంద్రంలో పలుగ్రామ గిరిజన ఆదివాసులందరు రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలుపుతూ హర్షం వ్యక్తపరుచారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతం నుంచి ఎన్నో కష్టాలు ఒడిదుడుకులను తట్టుకొని దేశ రాష్ట్రపతిగా అత్యున్నత స్థాయికి ఎదిగడం పట్ల గర్వపడతున్నమని, స్వతంత్రం వచ్చి సంవత్సరాలు గడిచినప్పటికీ ఆదివాసీలకు వారికి కేటాయించినటువంటి సంక్షేమ పథకాలు చట్టాలు  మొదలైన అభివృద్ధి ఫలాలు అందకపోవడం శోచనీయంమని,ఇకనైనా ఆదివాసీలకు న్యాయం జరగవచ్చుననిఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైన శుభ సందర్భంగా ఆదివాసి ప్రజలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు.ఒక ఆదివాసి బిడ్డకి ఇంతటి గౌరవప్రదమైన ప్రథమ పౌరురాలు హోదాను కల్పించుటలో సహకరించినటువంటి అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా మరొక మారు ధన్యవాదాలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తుడుండెబ్బ మండల అధ్యక్షుడు జుగ్నక్ సంబన్న లక్ష్మణ్ రాయసెంటర్ సార్ మెడి సోనేరావు డివిజన్ అధ్యక్షుడు టీ శంకర్ రాజు వివిధ గ్రామ పట్టేన్లు తదితరులు పాల్గొన్నారు.
Attachments area