15 ఏళ్ల విద్యార్థి సోషియల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌

బెంగళూరు, జూలై 5 : మంగళూరు సెయింట్‌ ఆలోయిసిస్‌ హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న  ఒక విద్యార్థి తన సొంత సోషియల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్‌ ఏర్పాటు చేసుకున్నాడు. మార్క్‌ జుకర్‌బెర్గ్‌ ఏర్పాటు చేసిన ఫేస్‌బుక్‌ స్ఫూర్తితో అతడు ఈ కొత్త సైట్‌కు శ్రీకారం చుట్టాడు. ఇందుక తన పాకెట్‌ మనీ అంతా ఖర్చు చేశాడు. పృథ్వీరాజ్‌ ఆమిన్‌(15)తన సైట్‌కు ‘యూ పిక్‌ సీయూ సీసీ’ అని పేరు పెట్టుకున్నారు. రెండు రోజుల క్రితం ప్రారంభించిన ఈ సైట్‌కు 48 గంటలో 600 మంది వీక్షకుల స్పందన వచ్చింది. జుకర్‌ బెర్గ్‌ తన 20 ఏళ్ల వయసులో ఫేస్‌బుక్‌ సృష్టించారు. ముందు సంగీతం ప్రధానంగా కల సైట్‌ కావాలనుకున్నప్పటికీ తరువాత మనసు మార్చుకుని సోషియల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్‌ను ఏర్పాటు చేసినట్టు ఆమిన్‌ చెప్పాడు. కంప్యూటర్‌ అంటే తమ పిల్లవాడికి చాలా ఇష్టమని తల్లిదండ్రులకు తెలిసినా ఏకంగా వైబ్‌సైట్‌ ప్రారంభించే సరికి వారి ఆనందాశ్చర్యాలకు అంతులేదు. తల్లి సుజయ అడ్వకేట్‌గా పనిచేస్తుండగా, తండ్రి సతీష్‌కుమార్‌ ఒక ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తున్నారు. కాగా ఈ కొత్త సైట్‌ కొన్ని సమస్యలను కూడా తెచ్చిపెట్టింది. మొదటి రోజే సర్వర్‌ క్రాష్‌ అయిందని తెలిపారు. 300 మంది వీక్షకులను అది తట్టుకోలేకపోయిందన్నాడు. ఇప్పుడు తాను కొత్త సర్వర్‌ కొన్నానని 50 వేల మంది వీక్షించినా ఏమీ కాదని చెప్పాడు. ఇంకా చిన్న చిన్న లోపాలున్నాయని, వాటిని సరి చేస్తున్నానని రోజూ కొత్త అనుభవాన్ని తెలిపాడు ఆమిన్‌.