విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు
ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
హైదరాబాద్,అగస్టు12(జనం సాక్షి): నగరంలోని గండిపేట వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిని సుచిత్రకు చెందిన కౌశిక్, జో డౌన్ అనే విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. గండిపేట సీబీఐటి రోడ్డులో విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టుకుని ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గండిపేట నుంచి నార్సింగ్ వైపు కారులో ఐదుగురు విద్యార్థులు వెళ్తున్నారు. కారు నడిపే సమయంలో రోడ్డు విూద అడ్డు వచ్చిన ఆటోను తప్పించబోయి కరెంటు స్తంభాన్ని కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సీబీఐటీ కాలేజీలో ఎగ్జామ్ ఉందని కౌశిక్ అనే విద్యార్థి వచ్చి మృత్యువాత పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకొని నార్సింగ్ పోలీసులు విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- ఢీ అంటే ఢీ..
- కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్ రేప్
- రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దు
- ముత్తంగి టోల్గేట్ వద్ద భారీగా గంజాయి పట్టివేత
- దొంగల ముఠా అరెస్ట్ రిమాండ్ తరలింపు
- ఆ అసత్యప్రచారాలను తెలంగాణ పటాపంచలు చేసింది
- మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం
- ఇలా వచ్చారు.. అలా తీసుకెళ్లారు
- క్యూబా ఇకపై ఒంటరే…
- ఇరాన్లో ఆందోళనలు హింసాత్మకం
- మరిన్ని వార్తలు



