16 న మెదక్ నియోజక వర్గంలో నిర్వహించు ర్యాలీని, సభను విజయవంతం చేయుటకు అధికారులు కలెక్టర్ రమేష్ అధికారులను ఆదేశించారు.

మెదక్, సెప్టెంబర్ 13, 2022
జనం సాక్షి ప్రతినిధి మెదక్
జా తీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 16 న మెదక్ నియోజక వర్గంలో నిర్వహించు ర్యాలీని, సభను విజయవంతం చేయుటకు అధికారులు ప్రణాళికాబద్ధంగా సమన్వయంతో పనిచేయవలసినదిగా అదనపు కలెక్టర్ రమేష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్ లో మెదక్ నియోజక వర్గానికి సంబంధించి మెదక్ పట్టణంలో ఉదయం 11 గంటలకు స్థానిక మునిసిపల్ కార్యాలయం నుండి జూనియర్ కళాశాల వరకు 15 వేల మందితో ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. నియోజక వర్గంలోని అన్ని మండలాల నుండి ఎస్టీ స్వయం సహాయక సంఘ సభ్యులను ర్యాలీలో, సభలో పాల్గొనేలా చూడాలని మండల పరిషద్ అధికారులకు సూచించారు. వాహనాల పార్కింగ్, బ్యారికేడింగ్ పనులు చూడవలసినదిగా ఆర్ అండ్ బి ఈఈ కి సూచించారు. సభ అనంతరం పాల్గొన్న అందరికి భోజనం అందించుటకు మండలం వారీగా కౌంటర్లు, మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయవలసినదిగా ఆర్.డి.ఓ. కు సూచించారు. 17 న జాతీయ పతాకం ఆవిష్కరణ అనంతరం ఎస్టీ ప్రజాప్రతిధులు, స్వయం సహాయక సభ్యులను హైదరాబాద్ కు పంపుటకు అవసరమైన బస్సులను సమకూర్చి పంపాలని జిల్లా రవాణాధికారికి సూచించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా పొలిసు బందోబస్త్ ఏర్పాటు చేయాలని డిఎస్పీ కి సూచించారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీ సైదులు, ఆర్.డి.ఓ. సాయి రామ్, ఆర్ అండ్ బి ఈఈ శ్యామ్ సుందర్, డి.ఎస్.ఓ. రాజి రెడ్డి, మండల పరిషద్ అధికారులు, తహశీల్ధార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నార