17వ రోజు టీఆర్‌ఎస్‌ పల్లెబాట

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ చేపట్టిన పల్లెబాట 17వ రోజుకు చేరింది. పల్లెబాటకు భారీ స్పందన లభిస్తోంది. గ్రామాల్లో గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. వీధుల్లో ‘ జై తెలంగాణ’ నినాదాలు మార్మోగుతున్నాయి. స్థానిక సమస్యల పరిష్కారానికే ప్రత్యేక రాష్ట్రంల కావాల్సిందేనని తెలంగాణవాదులు ఆకాంక్షిస్తున్నారు. పల్లెబాటలో ఇతర పార్టీల నేలతు, కార్యకర్తలు గులాబా దళంలో చేరుతున్నారు. కళాకారుల ఆటపాటలతో గ్రామాలు హోరెత్తుతున్నాయి. అఖిలపక్షంలో తెలంగాణకు అనుకూలంగా  చెప్పకపోతే సీమాంధ్ర పార్టీలకు రాజకీయ సమాధి తప్పదని టీఆర్‌ఎస్‌ నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు తెలంగాణపై తేల్చకపోతే పాతరేస్తామని తెలంగాణవాదులు  హెచ్చరిస్తున్నారు.