19 శాతం పెరిగిన భారత రైల్వేల ఆదాయం

న్యూఢిల్లీ: ఏప్రిల్‌ – నవంబరు మధ్య కాలంలో భారత రైల్వేల ఆదాయం 19.23 శాతం పెరిగింది. భారత రైల్వేలు ఈ ఏడాది రూ. 78,868 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. సరుకు రవాణా ద్వారా రూ. 54,487 కోట్లు, ప్రయాణీకుల ద్వారా రూ.20,423 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆ శాఖ తెలిపింది.