2012లో 119 మంది జర్నలిస్టుల మృతి
వియన్నా : 2012 సంవత్సరంలో ఇంతవరకూ 119 మంది జర్నలిస్టుల విధినిర్వహణలో మృతి చెందారని వియాన్నాకు చెందిన అంతర్జాతీయ ప్రెస్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. ఒక్క సిరియాలో జరిగిన దాడుల్లో 36 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని సంస్థ పేర్కోంది. సిరియా తదుపరి స్థానంలో 16 మంది మృతితో సోమాలియా ఉందని.. మెక్సికో, పాకిస్థాన్, ఫిలిఫ్పిన్స్‌లో కూడా ప్రాణాలు కోల్పోతున్న పాత్రికేయుల సంఖ్య ఎక్కువేనని వెల్లడించింది. ఈ నివేదిక మీడియా రంగానికి హెచ్చరిక సంకేతంగా పరిగణించాల్సి ఉంటుందని అ సంస్థ తెలిపింది.