2014లో వైఎస్సార్‌ సీపీ నుంచి పోటీ: నాని

గుడ్లవల్లేరు: 2014ఎన్నికల్లో తాను వైకాపా నుంచి పోటీ చేస్తానని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రకటించారు. ఆదివారం కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరు గ్రామ ఎస్సీవాడలో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పక్షం రోజుల కిదట తెదేపా నుంచి సస్పెండైన నాని తొలిసారిగా తన నిర్ణయాన్ని బహిరంగంగా చెప్పారు. అన్న ఎన్టీఆర్‌ ఆశయ సాధన కోసం రెండుసార్లు తెదేపా నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తాను పార్టీ అధికారంలోకి రాకపోవడంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తెదేపాకు రాజకీయ భవిష్యత్తు లేదని, బాబు మాటలు ప్రజలు విశ్వసించడంలేదని విమర్శించారు. 2014 ఎన్నికల్లో జగన్‌ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. అప్పుడు తాను రూ.250కోట్లతో గుడివాడ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పుట్టిన ప్రదేశం రుణం తీర్చుకోవడానికి తల్లి వంటి తెదేపాను వీడినట్లు తెలిపారు.

తాజావార్తలు