2019మార్చి 31నాటికి పేదలందరికీ ఇళ్లు
– నూతన మున్సిపాలిటీల్లో రూ.12,500 కోట్లతో అభివృద్ధి
– మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ
నెల్లూరు, ఆగస్టు9(జనం సాక్షి) : 2019 మార్చి 31నాటికి రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు అందిస్తామని ఏపీ పురపాలకశాఖ మంత్రి నారాయణ అన్నారు. బుధవారం నెల్లూరులో మంత్రి పర్యటించారు. దోమలపై దండయాత్రలో భాగంగా స్వయంగా కాలువల్లో మందు పిచికారి చేశారు. పలు వార్డుల్లో కాలువల పూడికతీత కార్యక్రమంలోనూ స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వర్షాకాలంలో డ్రైన్లు పొంగకూండా పూడికతీత పనులపై స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్నారు. ఆగస్టు చివరికల్లా అన్ని మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమం పూర్తిచేస్తామన్నారు. కొత్తగా ఏర్పడిన కాలనీల్లో రూ.12,500 కోట్లతో మౌలిక వసతులు అభివృద్ధికి ఈ వారం టెండర్లు పిలుస్తామని నారాయాణ వెల్లడించారు. ఇప్పటికే రూ. 700 కోట్లతో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రోడ్లు, కాలువలు నిర్మిస్తున్నట్టు తెలిపారు. పార్కుల అభివృద్ధిని ప్రత్యేక ప్రాధాన్యతాంశంగా తీసుకొని పనిచేస్తున్నామన్న మంత్రి నారాయణ పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్షానికి లేదని మండిపడ్డారు. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. రాత్రింబవళ్లు కష్టపడుతూ, విదేశాల్లో పర్యటిస్తూ పేరున్న కంపెనీలనురాష్ట్రానికి తప్పిస్తూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రత్యేక ¬దా, విభజన చట్టంలోని హావిూల పరిష్కారం కోసం చంద్రబాబు, తెదేపా ఎంపీలు ఓపక్క కేంద్రంపై పోరాటం సాగిస్తుంటే, ప్రతిపక్షనేత జగన్ మద్దతుగా నిలిచి పోరాడాల్సింది పోయి.. చంద్రబాబునాయుడినే విమర్శిస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు జగన్‌తీరుతో చీదరించుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని మంత్రి పేర్కొన్నారు.