నూతన సీఐని కలిసిన మైనారిటీ నాయకులు.

బెల్లంపల్లి, మార్చ్ 4, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణం వన్ టౌన్ సీఐగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శంకరయ్యను శనివారం ఆల్ ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ, ఆల్ ముస్లిం మైనారిటీ యూత్ కమిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. సీఐని కలిసిన వారిలో రాష్ట్ర అధ్యక్షుడు అన్వర్ ఖాన్, ఎండీ జాఫర్, యూత్ కమిటీ పట్టణ అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్, ఉపాధ్యక్షుడు అహ్మద్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి రషీద్ ఖాన్, షాదఫ్ తదితరులు ఉన్నారు.