సామాజిక న్యాయం సబ్బండ కులాలకు రాజ్యాధికారమే ధ్యేయంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్వర్యంలో సరూర్ నగర్ స్టేడియం గ్రౌండ్ లో బీసీల సింహగర్జన 

చలో సరూర్ నగర్ బీసీల సింహగర్జన గోడపత్రికను హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ ఆవిష్కరణ

 సంగారెడ్డి బ్యూరో , జనం , సాక్షి సెప్టెంబర్ 5  ::::సామాజిక న్యాయం సబ్బండ కులాలకు రాజ్యాధికారమే ధ్యేయంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్వర్యంలో సరూర్ నగర్ స్టేడియం గ్రౌండ్ లో బీసీల సింహగర్జన ఉంటుందనిఓబీసీ ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు అన్నారు. మంగళవారం  టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్ క్యాంప్ కార్యాలయంలో ఓబిసి ఉద్యోగ సంఘం నాయకులతో కలిసి చింతా ప్రభాకర్ గోడ పత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఓబీసీ నాయకులు మాట్లాడుతూసరూర్ నగర్ స్టేడియం గ్రౌండ్ లో బీసీల సింహగర్జన సభకు నియోజకవర్గంలోని బీసీ నాయకులను కలవడం జరుగుతుందన్నారు.మెమెంతో మకంతా..రానున్న ఎన్నికల్లో బీసీలకు ఏకువ సీట్లు కావాలని , రాజ్యాధికారంలో మా వాట మాకు కావాలని వాళ్ళ డిమాండ్ చేశారు.సింహగర్జన సభకు నియోజకవర్గంలోని బీసీ నాయకులు ఉద్యోగులు ,యువకులు, విద్యార్థులు తరలి రావాలని వారు పిలుపునిచ్చారు.ఉమ్మడి జిల్లాలో ఏకైక బీసీ నాయకులు  చింతా ప్రభాకర్ కు టికెట్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.వివిధ పార్టీలు కూడా బీసీ లకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.బీసీలకు సముచిత స్థానం ఇవ్వండి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు ,విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు జగదీష్, బీసీ యువత జిల్లా కన్వీనర్ గొరుగంటి రమేష్ కుమార్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాయకోటి రాజు, కురుమ యువత నియోజకవర్గ అధ్యక్షులు కొత్త గొల్ల సోమశేఖర్, లాడే మల్లేశం మాజీ ఎంపీటీసీ , కురుమ సంఘం జిల్లా ఉప అధ్యక్షులు కలువ గడ్డ మల్లయ్య , జలెందర్  ,తదితరులు పాల్గొన్నారు… పత్రికను ఆవిష్కరించారు.