సుందరయ్య నగర్ అంగన్వాడి కేంద్రంలోపోషకాహార మాసోత్సవం

వరంగల్ ఈస్ట్ సెప్టెంబర్ 13 జనం సాక్షివరంగల్ ప్రాజెక్ట్ పైడిపల్లి సెక్టర్ పరిధిలోని 14వ డివిజన్ సుందరయ్య నగర్ అంగన్ వాడి కేంద్రంలో బుధవారం పోషకాహార మాసోత్సవం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన స్థానిక కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారయ్య, ఐసిడిఎస్ సిడిపిఓ విశ్వజలు మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు రక్తహీనత గురించి, అదేవిధంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉండే ఆహారం గురించి వివరించారు. బాల్య వివాహాల వల్ల స్త్రీలు రక్తహీనతకు గురవుతారని అన్నారు. అనంతరం గర్భిణీలకు శ్రీమంతం నిర్వహించారు, మూడు సంవత్సరాల పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్ జక్కుల లావణ్య, పోషణ అభియాన్ కార్తీక్, అంగన్వాడి టీచర్స్ కే.లత, రత్నశ్రీ, శోభారాణి, వసంత, యశోద, మణి, పున్నమ్మ, విక్టోరియా, ఆయా స్వరూప, స్కూల్ టీచర్స్ పాల్గొన్నారు.

తాజావార్తలు