గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో విత్తన గణపతుల పంపిణీ-రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్.
తాండూరు సెప్టెంబర్ 14(జనంసాక్షి)
తాండూరు పట్టణంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన గణపతులను రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ.పర్యావరణ నష్టాన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే విత్తన గణపతుల పంపిణీకి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముందుకు వచ్చిందని ఆయన తెలిపారు. ప్రజలు వీలైనంత వరకు మట్టి ప్రతిమలను కొలిచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు నిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం మేరకు ఆ విత్తనాలతో కూడిన మట్టి గణేషులను పంపిణీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నీరజ బాల్ రెడ్డి, ఐవీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సంతోష్, ఐజేయూ జిల్లా ప్రెసిడెంట్ సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ చారి, సీనియర్ జర్నలిస్టులు శెట్టి రవి శంకర్, లింగేష్, బీమ్ సేన్ , మరియు , అక్షర మాడల్ స్కూల్ కరస్పాండెంట్ మోహన్ గౌడ్, విష్వవేద స్కూల్ ప్రిన్సిపాల్ గణేష్, వెంకటేష్ , పర్యాద రామకృష్ణ మిస్కిన్ శంకర్ , తాండూరు రజక సంఘం నాయకులు రమేష్ రవి, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు బాలరాజు, నరేందర్, వీరశైవ సమాజం నాయకులు వాలి శ్రవణ్ , కోటం శంకర్ , కుర్వ సంఘం నాయకులు బాలు, నర్సింలు, ఎన్.ఎస్.పి ట్రస్ట్ సభ్యులు భాను ప్రసాద్, కుర్వ బాలు, సచిన్, శ్రీశైలం, హరీష్, విజయ్, నరేష్ గౌడ్ , చందు తదితరులు పాల్గొన్నారు.