ఆర్టీసీ బస్సు నడిపించాలి

జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిల్ల, ముస్త్యాల గ్రామానికీ వచ్చే ఆర్టిసి బస్సు 20 రోజుల క్రితం నుండి రావడం లేదని ముస్త్యాల గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్యకి గ్రామస్థులు విద్యార్థులు తెలపడంతో వెంటనే గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య గోదావరిఖని డిపో కు వెళ్లి ఆర్టీసీ బస్సు సేవలను పునరుద్ధరించాలని గురువారం డిపో మేనేజర్ కు వినతిపత్రం సమర్పించారు. విద్యార్థులకు, గ్రామస్థులకు బస్సు రాకపోవడం తో చాల ఇబ్బంది అవుతుందని, విద్యార్థులు స్కూల్ కు, కాలేజీ కి వెళ్ళడం లేదని సర్పంచ్ లావణ్య డిపో మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే సుందిల్ల ముస్త్యాల గ్రామాలకు బస్సు నడపాలని సర్పంచ్ కోరగా డిపో మేనేజర్ ఆర్టీసీ సేవలను పునర్దిస్తారని తెలిపారు.

తాజావార్తలు