భారీగా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి బయలుదేరిన ప్రజలు, గద్వాల ఎమ్మెల్యే
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 16 (జనం సాక్షి);
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు సీఎం కేసీఆర్ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లపుర్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నా కార్యక్రమానికి గద్వాల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు అభిమానులు, మహిళలు భారీ ఎత్తున నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి కదలిన జనం.ఎమ్మెల్యే మాట్లాడుతూ
ఉమ్మడి పాలమూరు జిల్లా గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అన్ని రంగాలలో వెనుకబడింది. పాలమూరు జిల్లా మొత్తం విస్తీర్ణం 43.50 లక్షల ఎకరాలు ఉంటే అందులో వ్యవసాయ యోగ్యమైన భూమి దాదాపు 35 లక్షల ఎకరాలు అందులో సాగునీటి సౌకర్యం ఉన్న భూమి 4.6 లక్షల ఎకరాలు మాత్రమే ఉండేది అన్నారు.ఉమ్మడి రాష్ట్ర పాలనలో సాగునీరు లేని కారణంగా పాలమూరు ప్రజలకు బతుకు దెరువు కోసం వలసలు వెళ్ళే వాళ్ళు అనేక రకాలుగా పాలమూరు జిల్లాను పాలకులు నిర్లక్ష్యం చేయడం వలన పాలమూరు జిల్లా ప్రజలు నీటి పారుదల సౌకర్యాలు లేక వెనుకబడి, వివక్షకు గురై అనేక ఇబ్బందులను ఎదుర్కోన్నారు. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఎత్తిపోతల పథకాల ద్వారా మాత్రమే నీటి వసతి కల్పించడానికి ఆస్కారం ఉన్నది అని చెప్పి సీఎం కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తెలంగాణ జీవధార లాంటిది అని తాగునీరు, సాగునీరు అందించాలని లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది అని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలోనే రైతుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక నాయకుడు, రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా 24 గంటల కరెంటు, సాగునీరు, అందించడం. రైతుల అభివృద్ధి కోసం అహర్నిశలు అన్ని విధాలుగా ఆదుకుంటూ ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూసే విధంగా దేశానికి అన్నం పెట్టే విధంగా తెలంగాణ రైతాంగం ఉన్నది ప్రపంచంలోని వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు.మరోసారి సీఎం కేసీఆర్ ని, నన్ను మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే మరింత అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.