విశ్వ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.
నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో, జనంసాక్షి:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రాంతాలలో రంగురంగుల కాంతులతో మండపాలు దర్శనమిచ్చాయి.సంత బజార్ కాలనీలో విశ్వ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాల నుంచి వినాయక చవితి ఉత్సవాలు జరుపుతున్నారు.ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.నవరాత్రుల్లో భాగంగా శ్రీశైలం దేవస్థానం నుంచి 101 కేజీల లడ్డు ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుడికి సమర్పించడం జరిగిందని బృందం సభ్యులు తెలియజేశారు.ఈ తొమ్మిది రోజులు రోజుకు ఒక అలంకరణతో తీర్థప్రసాదాలు అన్నదాన కార్యక్రమాలు కోలాటాలు భజనలు అన్నీ జరుగుతాయని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు అల్లం పెళ్లి వాసు, శేషు, చంటి, రాఘవేందర్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.