కార్గోషిప్‌ను ఢీకొన్న నౌక: 24 మంది మృతి

మనిలా,(జనంసాక్షి): ఫిలిప్పీన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కార్గోషిప్‌ను సుమారు 700 మంది ప్రయాణికులతో ఉన్న నౌక ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 24మంది మృతి చెందగా 217 మంది గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన గంటలోపే సముద్రంలో నౌక మునిగిపోయింది.629 మంది ప్రయాణికులను కోస్టుగార్డులు కాపాడారు.