24గంటల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది

విశాఖ: రాగల 24గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఛత్తీస్‌ఘడ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్రమీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో అక్కడక్కడా చెదురుమదురు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈ దురుగాలులు వీస్తున్నాయి. సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.