26 నుంచి తెలంగాణ పాదయాత్ర :ఏబీవీపీ
వరంగల్,నవంబర్21: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో యూపీఏ ప్రభుత్వం మోస పూరిత వైఖరిని ఎండగడుతామని ఎబివిపి నేతలు చెప్పారు. డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి తెలంగాణ ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26 నంచి డిసెంబరు 6వతేదీ వరకు తెలంగాణలోని ఐదు ప్రాంతాల్లో పాదయాత్రలు చేపడుతున్నట్లు ఏబీవీపీ నగర కార్యదర్శి ఆర్.విష్ణువర్ధన్ పేర్కొన్నారుపాయాత్రకు సంబంధించి పాదయాత్ర పోస్టర్లను ఆవిష్కరించామన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ మోసపూరిత విధానాలు అవలంబిస్తోందన్నారు. ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా కేంద్రం మోసాన్ని గుర్తించాలన్నారు. లేకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.