26, 27న ఉత్తర తెలంగాణ బంద్
ఖమ్మం, జనంసాక్షి: బాసగూడ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులను పోలీసులు హతమార్చడం పై మావోయిస్టులు తీవ్ర నిరసర వ్యక్తం చేశారు. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈనెల 26 27న ఉత్తర తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నట్టు ప్రకటించారు. కాగా బాసగూడ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన తొమ్మిది మంది మావోయిస్టులతో పాటు మరో మహిళా మావోయిస్టు కూడా ఉందని తెలుస్తోంది. ఆ మహిళా మావోయిస్టు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు సమాచారం .